It is very unfortunate: Chief selector MSK Prasad on Sunil Gavaskar's 'lame duck' comment.Chairman of the selection committee of the BCCI, MSK Prasad reacted to the recent 'lame duck' jibe by Sunil Gavaskar.
#sunilgavaskar
#mskprasad
#teamindia
#selectioncommittee
#sports
#viratkohli
#ravishastri
#rahuldravid
#indvswi
#india
#westindies
వెస్టిండీస్ పర్యటనకు ఇటీవల ప్రకటించిన మూడు ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు.
దీంతో ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనపై ఒక్క రివ్యూ కూడా చేయకుండా కోహ్లీని తిరిగి కెప్టెన్ కొనసాగించడాన్ని సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. ఇదొక కుంటి బాతు సెలక్షన్ కమిటీలా ఉందని... ముందుగా వెస్టిండీస్ పర్యటనకు కోహ్లి దూరం అవుతాడని సెలక్టర్లు చెప్పారని, అయితే, ఒక్కసారిగా విండీస్ పర్యటనకు కోహ్లినే కెప్టెన్ అంటూ ప్రకటించారంటూ మండిపడ్డాడు.సోమవారం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పీటీఐకి ప్రత్యేక ముఖాముఖి ఇచ్చారు. సెలక్షన్ కమిటీపై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చాడు.